ఎటువంటి రంగంలోనైనా నైపుణ్యం, అర్హత గల పౌరులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కిరణ్ కుమార్ కుమార్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యవృద్ది సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన నైపుణ్యగణన- 2024లో భాగంగా మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని శనివారం చెన్నూరు ఎంపీడీవో ఆధ్వర్యంలో స్థానిక సభా భవనంలో నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ నైపుణ్యం గల పౌరులు ఎంతమంది ఉన్నారని సచివాలయ సిబ్బంది సర్వే చేయాలన్నారు.