ముద్దనూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముద్దనూరు, కొండాపురం, సింహాద్రిపురం, తొండూరు మండలాల్లో మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తులు అందుకుంటున్నట్లు సోమవారం ఎక్సైజ్ సీఐ విన్నీలత తెలిపారు. ముద్దనూరులో-2, కొండాపురం-2, సింహాద్రిపురం-2, తొండూరు మండలంలో ఒకటి చొప్పున ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దుకాణానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.