బి. కోడూరు మండలం తంగేడుపల్లెకు చెందిన వెంకటసుబ్బయ్య అనే రైతు నిమ్మ, జామ చెట్లు, రేకుల షెడ్డును కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తెలుసుకున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా ఆ స్థలానికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చున్నాడని టీడీపీకి చెందిన రమణారెడ్డి అనుచరులు దౌర్జన్యంగా ప్రవర్తించి 40 మందితో కలిసి ఒక వ్యక్తిపై దాడు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.