అనంతపురం జిల్లాలో 348. 3 మి. మీ వర్షపాతం నమోదు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 348. 3 మి. మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ శుక్రవారం తెలిపారు. సెట్టూరులో 59. 2, బ్రహ్మసముద్రం 38. 2, డి. హీరేహల్ 28. 6, బొమ్మనహల్ 21. 4, రాప్తాడు 18, ఎల్లనూరు 16. 8, కళ్యాణదుర్గం 16. 7, గుమ్మగట్ట 15. 6, కంబదూరు 14, గార్లదిన్నె 11. 4, కూడేరు 11. 2, ఉరవకొండ 10. 4, కనేకల్ 10, శింగనమల 8. 4, రాయదుర్గం 7. 8, విడపనకల్ 7. 4, పుట్లూరు 7. 0, అనంతపురంలో 6. 4 మి. మీ నమోదైంది.