అనంతపురం జిల్లా కేంద్రంలోని పాతూర్ గాంధీ విగ్రహం వద్ద నుంచి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మంగళవారం చేపట్టారు. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు. అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈనెల 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.