వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలుకుతూ ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ పలు సంస్థలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు ఆఫీసులకెళ్లి పనిచేస్తున్నారు. కానీ కొందరు ఇంటి నుంచి పని చేయడానికే మక్కువ చూపుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈఓ మాట్ గార్మాన్ అన్నారు. వారానికి ఐదు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించారు. ఇది ఇష్టం లేనివారు ఉద్యోగం వదిలేయొచ్చన్నారు.