ఉరవకొండ పట్టణంలోని స్థానిక రిటైర్డ్ టీచర్ మహబూబ్ బాష ఇంటి ఆవరణలో ఉన్న మందార చెట్టుకు ఒకే కొమ్మకు రెండు రకాల పూలు పూచాయి. ముద్దమందారం చెట్టుకు ఎప్పుడూ గుత్తి లాగ ఉండే మందారం పూలు పూసేవి విశేషంగా గత కొన్ని రోజులుగా ముద్దమందారం పూలతో పాటు ఐదు రెక్కలు గల మందారం పూలు కూడా పుస్తున్నాయి. ఈ రోజు ఒకే కొమ్మకు పక్క పక్కనే ఒకటి ముద్దమందారంతో పాటు ఐదు రెక్కల మందారం పువ్వు కూడా వికసించింది.