శుక్రవారం ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్వామా ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కార్యక్రమం కింద జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. జిల్లా అంతా పచ్చదనం తీసుకురావాలని, నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. కళాశాల ఆవరణంలో గత జూలై నెలలో వేసిన ప్లాంటేషన్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.