ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోయే ముందు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ కు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వం ప్రాధాన్యతలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పయ్యావుల కేశవ్ వివరించారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు.