కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఉరవకొండలోని విద్యుత్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులు సోనియా శీనా, అబ్బాస్, చంద్ర, హరి మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఉచిత పథకాలు ప్రకటించి, వాటిలో భాగంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసిన వెంటనే, విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేయటం సరికాదు అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.