కూడేరు మండల కేంద్రంలోని విజ్ఞేశ్వర కాలనీ యందు సిపిఐ నాయకులు ఆదివారం ఇంటింటికి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికలు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి కేశవ రెడ్డిలు డిమాండ్ చేశారు.