అనంతపురం జిల్లా రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలో రాయదుర్గం మండలం నుంచి పి. అనుష, గుమ్మఘట్ట మండలం బి. అనిత, బి రోజ కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బి. నాగవేణి, భూలక్ష్మీ తదితరులు అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా నియమించినట్లు జాతీయ ఛైర్మెన్ శ్రీ బి. వెంకటేశ్వర రాజు తెలిపారు. తొందరలో వీరికి సంబంధించిన ఐడి కార్డులు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఛేంజ్ ఫర్ సొసైటీ టీం మహిళ సభ్యులు మాట్లాడుతూ.. మమ్మల్ని ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గా నియమించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మా నియోజకవర్గాల పరిధిలో మరెన్నో సేవలను అందించడానికి కృషి చేస్తామని, తమపై ఉంచిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకొంటామని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటామని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్, నాగేశ్వరి బిల్డర్స్ అధినేత యస్ వి కోటేశ్వరరావు, వై యస్ అర్ టీమ్ఇండియా జాతీయ అధ్యక్షులు యన్ సురేంద్రరాజ్ రెడ్డి, దుర్గం చారిటబుల్ ట్రస్ట్ కంబాల తిమ్మారెడ్డి, ఛేంజ్ ఫర్ సొసైటీ టీం అధ్యక్షులు జబివుల్ల శుభాకాంక్షలు తెలియజేశారు.