విత్తనాలు కనీస మద్దతు ధరతో కొనుగోలు

1619பார்த்தது
విత్తనాలు కనీస మద్దతు ధరతో కొనుగోలు
అనంతపురం జిల్లా కనేకల్లు మండలంలోనిని రామ నగర్ లో గురువారం పప్పు సెనగ కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ అధ్యక్షులు పైనేటి తిమ్మప్ప చౌదరి ప్రారంభించారు. రామనగర్ లోని పిఎసిఎస్ గోదాము వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సొసైటీ అధ్యక్షులు తిమ్మప్ప చౌదరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పప్పు సెనగ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్వింటాలు శనగ విత్తనాలు కనీస మద్దతు ధర 5335లతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదని శనగ రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ దరకు ప్రభుత్వం శనగ విత్తనాలను కొనుగోలు చేస్తుందన్నారు. పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో పంట ఉత్పత్తులను విక్రయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కనేకల్ పిఎసిఎస్ సీఈవో హనుమంతు, ఎంపీఈఓ లాలుస్వామి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி