ప్రభుత్వాసుపత్రిలో అధ్వానంగా పారిశుధ్యం

946பார்த்தது
ప్రభుత్వాసుపత్రిలో అధ్వానంగా పారిశుధ్యం
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఇంటిని, ఇంటి పరిసరాలను పరి శుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రతతోనే ఆరోగ్యం అని ఆరోగ్య పదేపదే చెప్తున్న మాటలివి. అయితే రాయదుర్గం ప్రభుత్వాసుపత్రి ఇందుకు భిన్నం. అపరిశుభ్రత, దోమ కాటుకు రోగాలబారిన ప్రజలు ప్రభుత్వాసుపత్రికి వస్తే మరిన్ని వ్యాధులకు గురికావల్సిందేనని ఆందోళన చెందు తున్నారు. ఈ ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఆసుపత్రిలో రోజూ వాడిన వేస్టేజీ, మందులు, సిరంజిలు, ఆపరేషన్‌కు ఉపయోగించిన పలు వస్తువులను బయట పడేస్తారు. ఈ చెత్తను పోస్టు మార్టం గది వద్ద ఉన్న కుండీలో వేస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ రోజూ చెత్త కుండీలో వేస్తున్న ఆసుపత్రి వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించడం లేదు. దీంతో తీవ్రమైన కంపు వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు వాడి పడేసినవి, డయాలసిస్‌ చేసిన వేస్టేజీ గుడ్డలు ఇతర మందులను ఆ చెత్తకుండీలో వేస్తుండడంతో తీవ్రమైన కంపు వస్తోం దని, ఆ పరిసరాల్లో దోమలు, ఈగలు ఎక్కువై సమీ పంలో ఉన్న చిరు దుకాణాల్లోకి వెళ్తున్నాయి. అక్కడే పార్కింగ్‌ స్థలంకూడా ఉంది. పక్కనున్న పోస్టుమార్టం గదిని కూడా శుభ్రం చేయక పోవడంతో భరించలేని కంపుతో ఇబ్బంది పడుతున్నామని రోగులు చెప్తున్నారు. సీజ నల్‌ వ్యాధులపైనా, పరిశుభ్రతపైనా ఆసుపత్రి లోపలి ప్రాంగణ ఆటోలకు స్టాండుగా మారింది. ఇలాంటి పరిస్థితిల నుంచి రోగులను కాపాడాల్సిన ప్రభుత్వాసుపత్రి అధికారుల పట్టించు కోవడం లేదు. ఆసుపత్రికి వచ్చే మెయింటినెన్స్‌ నిధులు ఏమవుతున్నాయని పలువురు రోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న చెత్త కుండీని మరోప్రాంతానికి మార్చడంతోపాటు రోజువారీ పారిశుధ్య చర్యలు చేపట్టాని రోగులు కోరుతున్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி