పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష

1815பார்த்தது
పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష
ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ రాయదుర్గం మండల కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షను రాయదుర్గం పరిధిలోని జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు వచ్చే నెలలో 10వ తరగతి పరీక్షలకు భయాందోళనకు గురికాకుండా ముందుగానే ఈ విధంగా ప్రతిభ పరీక్ష రాయడం ద్వారా విద్యార్థులకు ఉన్న భయాలను పోగొట్టి ముందుగానే వారి పరీక్షలకు చాలా వరకు ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ యూటీఎఫ్ వెంకట్రాం రెడ్డి ఇప్పుడు జరుగుతున్న ప్రజ్ఞా వికాస పరీక్ష గురించి, భవిష్యత్తులో జరిగే ఇతర పరీక్షల గురించి సలహాలు ఇవ్వడం జరిగింది.

అనంతరం జడ్పీ పల్లె పల్లి హై స్కూల్, హెచ్ఎం వెంకట రమేష్ మాట్లాడుతూ.. జానకిరామ్ మండి చిన్న మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యూటీఎఫ్ ఉపాధ్యాయులకు అదే విధంగా ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల హెచ్ఎం లకు కరస్పాండెంట్లకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు వంశీ, గౌతమ్, మండల ఉపాధ్యక్షులు లోకేష్, ప్రేమ్, నాయకులు హరీష్, నందిని, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி