తాసిల్దార్ ఫై ఫైర్ అయిన అంగన్వాడీ వర్కర్లు

1683பார்த்தது
తాసిల్దార్ ఫై ఫైర్ అయిన అంగన్వాడీ వర్కర్లు
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి సిబ్బంది ఆందోళనకు దిగారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఎస్ఎఫ్ఐ నాయకులు ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫేస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని, మార్చి 20వ తేదీన అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడి వర్కర్లు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసగొలిపి ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతుకులను నొక్కువేయాలని చూడటం హాస్యాస్పదమని అన్నారు. సోమవారం అంగన్వాడి వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, ఎమ్మార్వో కార్యాలయం వద్ద అరగంట పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బి మల్లికార్జున మాట్లాడుతూ, అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలను పెంచాలని కోరారు. పేస్ యాప్ రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో అంగన్వాడీలపై రాజకీయ వేధింపులను ఆపాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி