తృటిలో తప్పిన పెను ప్రమాదం

7490பார்த்தது
తృటిలో తప్పిన పెను ప్రమాదం
అనంతపురం జిల్లా కనేకల్ మండలం పరిధిలో బెనేకల్ గ్రామంలో బుధవారం ఉదయం 30 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న వాహనం బెనేకల్ నుండి ఉద్దేహళ్ గ్రామానికి వెళ్తోంది. ఎస్ఆర్ఎన్ క్యాంప్ బెనేకల్ మార్గం మధ్యలో వెంకట్రావు పొలం దగ్గర మలుపు వద్ద స్టీరింగ్ కట్ అవడంతో వ్యాను అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకు వెళ్ళింది. రోడ్డు పక్కన ఉన్నటువంటి పెద్ద రాయి ఉన్నందువల్ల వ్యానుకు వెనుక భాగంలో ఉన్నటువంటి బంపర్‌కు రాయి పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. వ్యాన్లో వెనుక భాగంలో ఉన్నటువంటి కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాలైనటువంటి కూలీలను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி