ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థి సరిత హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇటుకలపల్లి సీఐ హేమంత్ కుమార్ మంగళవారం తెలిపారు. మంగళవారం గుమ్మగట్ట మండలం వెంకటంపల్లికి చెందిన తిప్పేస్వామిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, వేటకొడవలి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రేమించాలని యువతిని ఫోన్లో వేధించేవాడని, ఆమె అంగీకరించకపోవడంతో వెంటపడి హత్య చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.