పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని చిత్రావతి రహదారిలో డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన తీగలను మున్సిపల్ అధికారులు తొలగించారు. స్థానికంగా బట్టలు ఉతికే వారు డివైడర్ల మధ్యలో తీగలను కట్టి వాటిపై దుస్తులు ఆరవేస్తుండగా పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ప్రహల్లా ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం మున్సిపల్ సిబ్బంది డివైడర్ల మధ్య గల తీగలను తొలగించారు.