పుట్టపర్తిలో డ్రైనేజీ సమస్య తీరేనా?

82பார்த்தது
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోని స్టేట్ బ్యాంక్ రోడ్లో డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతోంది. ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం లేదని మంగళవారం స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ముందు ఇలా నీరు పొంగిపొర్లుతుంటే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడితే మాకు బాధ్యత ఎవరు వహిస్తారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி