పెనుకొండ నియోజకవర్గంలో పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా తెలుగు మహిళా ఆధ్వర్యంలో వంట-వార్పు కార్యక్రమం నిర్వహించారు హిందూపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు పార్థసారథి. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటరి టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ , రాష్ట్ర టిడిపి కార్యదర్శశులు నరసింహ మూర్తి, రామాంజి నమ్మ, కొల్లకుంట్ట అంజి నప్ప, గాండ్ల విశాలాక్ష్మి, శివ బాలా, మండల పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, చంద్రమౌళి, సోముశేఖర్, సిద్దలింగప్ప, ఏడు నియోజకవర్గాల నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, మాజీ ఎంపీపీ, ఎక్స్ సర్పంచులు సీనియర్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.