రొద్దం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను విడుదల చేయండి: ఉషాశ్రీ

52பார்த்தது
రొద్దం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను విడుదల చేయండి: ఉషాశ్రీ
రొద్దంలో ఇటీవల టీడీపీ నాయకులు కర్ణాటకకు తరలిస్తున్న ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త బాలాజీ రెడ్డిని అరెస్టు చేశారని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. ఆదివారం ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ అరెస్టు చేసిన యువ రైతు బాలాజీ అచూకీ తెలియజేసి, వెంటనే పోలీసులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ కార్యకర్త కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி