నైపుణ్య సర్వే ద్వారా యువతకు ఉద్యోగ అవకాశలు కల్పించేలా ముందుకెళ్లాలని పెనుకొండ నగర పంచాయతీ కమిషనర్ జి. శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం నగర పంచాయతీ కార్యాలయంలో నైపుణ్య గణన పై సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, గణన సర్వేపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ వీటి వల్ల యువతకు కొత్త అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.