బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ రాణించాలని, వారి అభ్యున్నతే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమని మంత్రి సవిత అన్నారు. శనివారం పెనుకొండలో ప్రభుత్వ బీసీ కళాశాల హాస్టల్ శాశ్వత భవనాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ హాస్టళ్లను అన్న ఎన్టీఆర్ ప్రారంభించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం బీసీ బిడ్డల చదువు కోసం మరింత ప్రాధాన్యమివ్వ సాగారన్నారు.