పెనుకొండ మండలం టీడీపీ కార్యాలయంలో కురుబ కులస్థులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ అనంతపురంలో శ్రీ భక్త కనకదాసు 537వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పూర్వకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని కురుబ కులస్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.