సోమందేపల్లి చెరువు కట్ట కింద పంట పొలాలు పరిశీలించిన మంత్రి సవిత, నీటి సమస్య తీర్చాలని హంద్రీ-నీవా కాలువ ఈఈను ఆదేశించారు. మంత్రి సూచనలతో శనివారం 30 పైపులు సోమందేపల్లికి తీసుకురావడం జరిగింది. ఈ పైపుల ద్వారా రైతులకు నీరు అందిస్తామని హిందూపురం పార్లమెంట్ టిడిపి కార్యదర్శి నీరుగంటి చంద్రా తెలిపారు. పది సంవత్సరాల రైతు కష్టాలు తీరతాయని, రైతులు ఆనందం వ్యక్తం చేశారు.