మడకశిర మండల పరిధిలోని గౌడనహళ్లి గ్రామంలో ఉన్న సచివాలయంలో మంగళవారం ఉద్యోగులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు సమయానికి రాక అటు విధులకు కూడా అప్పుడప్పుడు వచ్చి పోతున్నారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం జీతం ఇచ్చి ఉద్యోగులను సచివాలయాలకు నియమించినప్పటికీ ఉద్యోగులు మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.