కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ముదిగల్లు గ్రామానికి చెందిన అలివేలమ్మ కుందుర్పి మండలం కరిగానిపల్లి గ్రామంలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది.