హిందూపురం నియోజకవర్గం కులగుట్టపల్లిలో పేదల గుడిసెలను కూల్చిన సంఘటనపై సిపిఎం నేత రాంభూపాల్ ఆదివారం బాలకృష్ణకి లేఖ రాశారు. సిపిఎం నాయకులు కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించి పేదల పరిస్థితిని వివరిస్తూ వారికి న్యాయం చేయాలని కోరారు. భూకబ్జాదారుల కారణంగా అన్యాయంగా గుడిసెలను కూల్చివేసినట్లు ఆరోపించారు. పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, నష్టపరిహారం అందించాలని బాలకృష్ణ స్పందించాలంటూ సిపిఎం నేతలు విజ్ఞప్తి చేశారు.