గుంతకల్లు: సీపీఎం నాయకుల ధర్నా
దస్తావేజులు లేని కారణంగా విద్యార్థులు, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయకులు అన్నారు. దస్తావేజులు అందుబాటులో లేకపోవడంతో నాయకులు సోమవారం గుంతకల్లు పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.