గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాలు జనాలతో బుధవారం కిక్కిరిసిపోయాయి. ఆధార్ కరెక్షన్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయాలు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అపార్ ఐడీ కార్డు జారీ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల్లో ఉన్న మాదిరిగా ఆధార్‌ను కరెక్షన్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.