నాయి బ్రాహ్మణులను దూషించిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి పట్టణంలో మంగళవారం నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు. అనంతరం నాయి బ్రాహ్మణులను దూషించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, సంఘ సభ్యులు పాల్గొన్నారు.