గుంతకల్లు: కసాపురం అంజన్న ఆలయం భక్తులతో కిటకిట

82பார்த்தது
గుంతకల్లు మండలంలోని కసాపురంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి వారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తికి వెండి రథములో కొలువు తీర్చి ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయం మారుమోగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி