పామిడి పెన్నానదిలో ఆక్రమణలు తొలిగిస్తామని తహశీల్దార్ శ్రీధర్ మూర్తి మీడియాకు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాస్ సూచనలతో శుక్రవారం పెన్నా నదిలో 186. 7 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ, ఇటుక బట్టీలు, శ్మశానం, ఆలయాల కట్టడాలు ఉన్నాయన్నారు. అక్రమణదారులకు నోటీసులు అందించి తొలిగిస్తామని తెలిపారు. సర్వే సమయంలో కనిపించకుండా తప్పించుకున్న వారిని గుర్తిస్తామన్నారు.