గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ సిబ్బంది రోడ్డు పరిశుభ్రత పనులు చేపట్టారు. గుత్తి నుంచి ఆర్ఎస్ వరకు రోడ్డు ఇరువైపులా పరిశుభ్రత పనులు చేపట్టారు. చిన్న జేసీబీ సాయంతో రోడ్డు ఇరువైపులా ఉన్న కంప చెట్లను, చెత్తా చెదారాన్ని, అపరిశుభ్రతను తొలగించారు. ఇంకా మూడు రోజులు పాటు రోడ్డు పరిశుభ్రత పనులను నిర్వహిస్తామని కమిషనర్ చెప్పారు.