గుత్తి మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ లో ఉన్న పన్నులను వసూలు చేయడం కోసం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా ఆధ్వర్యంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి పన్ను, నీటి పన్ను, వేకెంట్ ల్యాండ్ పన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూలు కోసం ఇళ్లకు, షాపులకు వెళ్లారు. వెంటనే పన్ను చెల్లించాలని కోరారు. ఒకవేళ పన్నులు చెల్లించకపోతే జరిమానాలతో పాటు చర్యలు తీసుకుంటామని చెప్పారు.