గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో శనివారం పెన్షనర్స్ నాయకులు అబూబకర్, స్వర్ణాంబ, కుల్లాయి బాబు ఆధ్వర్యంలో పెన్షనర్స్ తో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం పెన్షనర్స్ నాయకులు కుళ్లాయి బాబు మాట్లాడుతూ.. పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.