కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్ తో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ పోస్టర్లను విద్యార్థి సంఘం నేతలు విడుదల చేశారు. బుధవారం ధర్మవరం పట్టణంలో పిఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు నాగ సాయి, ఉదయ్, అభిషేక్, సాయి చరణ్ లు పోస్టర్లను విడుదల చేశారు.