అనంత: మహిళలకు 33% రిజర్వేషన్ అమలు పరచాలి
అనంతపురంలోని ఎంపీ కార్యాలయంలో సోమవారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను ఎన్. ఎఫ్. ఐ. డబ్ల్యూ సభ్యులు కలిశారు. అనంతరం సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని, మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్ ను తక్షణమే అమలు చేయాలని ఎంపీకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సి. పి. ఐ మహిళా సీనియర్ నాయకురాలు పద్మావతి, మహిళా సమాఖ్య నగర అధ్యక్షురాలు జానకి, తదితరులు పాల్గొన్నారు.