కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాల మంజూరు లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్ డిపిఆర్సీ భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశంలో, బ్యాంకర్లు మరియు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.