సైబర్ నేరాల నేపథ్యంలో సెల్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ మంగళవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, ఉద్యోగులు, ఉన్నత హోదాలలో ఉన్న వారు సైతం సైబర్ ఉచ్చులో పడుతున్నారని, కావున జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.