ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నట్లు నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట రంగయ్య ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. పదో తరగతిలో 450కు పైగా, ఇంటర్ లో 850కు పైగా సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తులను నవంబర్ 24వ తేదీలోపు అనంతపురంలోని జయమణెమ్మ కల్యాణమండపంలో అందజేయాలని తెలిపారు.