గ్యాంగ్ రేప్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ ఐజీపీ సి. హెచ్ శ్రీకాంత్ పోలీస్ అధికారులను సోమవారం ఆదేశించారు. అనంతపురంలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ. పదే పదే నేరాలకు పాల్పడే నిందితులపై లోతైన నిఘా కొనసాగాలని సంచలన కేసులు, తీవ్రమైన నేరాలలో నిందితులకు కఠిన శిక్షలు పడేలా సాక్షాదారాలు సమర్పించాలన్నారు.