గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రాంరెడ్డిని శుక్రవారం గుంతకల్లు పట్టణంలో వారి స్వగృహములో గుత్తి పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గుత్తి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను, పరిస్థితులను వారికి క్షుణ్ణంగా వివరించారు. త్వరలోనే గుత్తిలో పర్యటిస్తానని మాజీ ఎమ్మెల్యే తెలిపారని చెప్పారు. వరదరాజులు, ఫరూక్, రమణ, శివ తదితరులు పాల్గొన్నారు.