రావికమతం మండల ఓమ్మవరం గ్రామం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలను సోమవారం చోడవరం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు సూచన మేరకు తెదేపా నాయకులు, కార్యకర్తలు, పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఎస్ ఎం సి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఎన్నికల పర్యవేక్షకులు, ఉపాధ్యాయులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పేరెంట్స్ పాల్గొన్నారు.