తాండవ రిజర్వాయర్ నుంచి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుత మట్టం 378 అడుగులుగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.