ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ఆరోపించారు. బుధవారం నియోజకవర్గ స్థాయి వైసిపి నాయకులతో నర్సీపట్నంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేశ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉచితంగా ఇసుకను అందజేస్తామని చెప్పారని, ఇంత వరకు ఇసుకను ఉచితంగా ఇవ్వలేదని చెప్పారు. సుమారు 5వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.