ఎంవీపీ కాలనీ: శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు డీఎస్సీ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఎంవీపీ కాలనీ బీసీ స్టడీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన ఉచిత డీఎస్సీ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేవరకు విశ్రమించవద్దన్నారు. నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా ప్రిపరేషన్ కొనసాగించాలన్నారు.