విశాఖ: ఆ భూములతో నాకు సంబంధం లేదు
విశాఖ దసపల్లా, ఎన్ సి సి భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదని,. ఏ విచారణకైన నేను సిద్ధంగా వున్నానని. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదని వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ ఇంచార్జ్, ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తుందని, త్వరలోనే నిజ నిజాలు తెలియని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.