విశాఖ నగరం గోకుల పార్క్ వద్ద జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పాలు,పెరుగు యదుమేళా ఉత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎంపీ శ్రీ భరత్, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా కలిగిన యాదవులంతా ఐక్యంగా రాధాకృష్ణ మహోత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.